ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి

తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

Update: 2025-12-26 07:19 GMT

 nizamabad crime news

తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సొంత కారులో మృతదేహం లభ్యం అయింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ గుగులోతు సర్దార్ నాయక్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. తన సొంత కారులోనే పడుకొని మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన రెండు రోజుల పాటు ఎవరికీ తెలియకుండా ఉంది.

సమాచారం అందుకున్న...
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రియా హాస్పిటల్‌కు తరలించారు. మృతి కారణాలపై స్పష్టత రావాల్సి ఉండగా, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు సర్దార్ నాయక్ స్వస్థలం మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం, తండ ధర్మారంగా గుర్తించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అనుమానాస్పద మృతి కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అయితే తరచూ విధులకు హాజరు కాకపోతుండటంతో అధికారులు ఆయనను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడా? హత్యకు గురయ్యాడా? అన్నది పోలీసుల విచారణలో తేలనుంది.


Tags:    

Similar News