Pawan Kalyan : నేడు హైకోర్టులో పవన్ కల్యాణ్ పై విచారణ
నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పవన్ కల్యాణ్ కు సంబంధించిన కేసుపై విచారణ జరగనుంది.
నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పవన్ కల్యాణ్ కు సంబంధించిన కేసుపై విచారణ జరగనుంది. ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ సినిమా ప్రమోషన్ లో పాల్గొనిప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని, అధికార దుర్వినియోగం చేశారని పిటీషన్ దాఖలయింది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు.
మంత్రిగా ఉంటూ...
మంత్రిగా ఉంటూ సినిమాల్లో నటిస్తున్నారని, ప్రభుత్వ వాహనాలను, భద్రతా సిబ్బందిని సినిమా కార్యక్రమాలకు వినియోగించారని విజయ్ కుమార్ పిటీషన్ లో పేర్కొన్నారు. దీంతో నేడు దీనిపై హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినయోగంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై నిర్ణయం ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతుంది.