నేడు యర్రగొండపాలెంలో చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు యర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించనున్నారు

Update: 2023-04-21 03:53 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు యర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొననున్నారు. కడప, గిద్దలూరు, మార్కాపురంలో సభలు విజయవంతం కావడంతో యర్రగొండపాలెంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. చంద్రబాబు సభకు అధిక సంఖ్యలో జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు చంద్రబాబు సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మిలియనీర్లు వచ్చారంటే...
నిన్న మార్కాపురంలో జరిగిన సభలో ప్రసంగిస్తూ తాను సినిమా నటుడిని కాదని, అయితే ఇంతటి మీ స్పందన కంటే ఇకేం కావాలి అని చంద్రబాబు ప్రశ్నించారు. తాను హైదరాబాద్ లో వేసిన ఫౌండేషన్ కారణంగానే నేడు అక్కడ మిలియనీర్లు వచ్చారని చంద్రబాబు తెలిపారు. ఎవరి కోసం హైదరాబాద్ అభివృద్ది చేశాను? మీ కోసం కాదా? అని ప్రశ్నించారు. ఈ రోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు వారు కనిపిస్తున్నారన్న చంద్రబాబు, మార్కాపురంలో ఒక సంకల్పం చేశానని, రాష్ట్రంలో పేదవారు లేని సమాజం తీసుకురావాలి అని నేను సంకల్పం తీసుకున్నానని తెలిపారు.


Tags:    

Similar News