నేడు వంగవీటి మోహన్ రంగా వర్ధంతి
విజయవాడలో నేడు వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు
విజయవాడలో నేడు వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే వర్ధంతి కార్యక్రమాలను వేర్వేరుగా వంగవీటి రాధా, ఆశా కిరణ్ లు నివాళులర్పించనున్నారు. విజయవాడలోని రాఘవయ్య పార్క్ సమీపంలోని రంగా విగ్రహానికి నివాళులర్పించనున్నారు. రంగా వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.
విశాఖలో కాపునాడు...
ఈరోజు విశాఖలోనూ కాపునాడు జరగనుంది. విశాఖ బీచ్ రోడ్డులో జరగనున్న కాపునాడు సమావేశానికి వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ హాజరు కానున్నారు. రాష్ట్రంలోని రంగా అభిమానులతో పాటు రాధా, రంగా మిత్రమండలి, యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నేతలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. విజయవాడ, విశాఖలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.