Andhra Pradesh : నేడు తిరుపతికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు తిరుపతికి నేడు రానున్నారు. తొలుత జాతీయ సాంస్కృతిక విద్య విశ్వ విద్యాలయంలోమూడు రోజుల పాటు జరిగే భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు.
పోలీసు జిల్లా కార్యాలయాన్ని...
ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన అనంతరం జిల్లా పోలీసు కార్యాలయాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం కొద్దిసేపు పార్టీ నాయకులతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. చంద్రబాబు తిరుపతి పర్యటన సందర్భంగా పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు. చంద్రబాబు అనంతరం తిరిగి అమరావతికి చేరుకోనున్నారు.