తిరుపతి పర్యటనకు చంద్రబాబు
మే 2వ తేదీ నుంచి తిరుపతి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు
మే రెండో తేదీ నుంచి తిరుపతి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు తిరుపతిలో చంద్రబాబు పర్యటన కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మే 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు రేణిగుంట ఎయిర్‍పోర్టుకు చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం వెంకటగిరిలో చంద్రబాబు రోడ్‍షో జరుగుతుందని తెలిపారు. మే 3న ఉదయం 8.30 నుంచి 9.30 వరకు సెల్ఫీ విత్ చంద్రబాబు కార్యక్రమం ఉంటుంది.
మూడు రోజుల పాటు...
మే 3న ఉదయం 10 నుంచి చేనేతలతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. మే 3న మధ్యాహ్నం 2 గంటలకు గూడూరులో చంద్రబాబు రోడ్ షో ఉంటుంది. మే 3న రాత్రికి చిల్లకూరు మండలం బూదనంలో చంద్రబాబు బస చేయనున్నారు. మే 4న ఉదయం 9.30 గంటలకు బీసీలతో చంద్రబాబు సమావేశం జరుగుతుంది. మే 4న సాయంత్రం నాయుడుపేటలో చంద్రబాబు ప్రసంగం ఉంటుంది.