చలించిన చంద్రబాబు.. వైసీపీ నేతకు సాయం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ నేత ప్రభావతికి ఆర్థిక సాయం అందచేశారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ నేతకు ఆర్థిక సాయం అందచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో ఆయన ఈరోజు పర్యటించారు. పంట నష్టాన్ని పరిశీలించారు. నష్టపోయిన రైతులను పరామర్శించారు. అకాల వర్షాలకు పూర్తిగా నష్టపోయామని రైతులు చంద్రబాబుకు తన గోడు చెప్పుకున్నారు. ధాన్యం తడిసిపోయి, ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో తాము రోడ్డును పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.
2.30 లక్షలు అందించి..
అయితే ఈ సందర్భంగా వైసీపీ మహిళా రైతు ప్రభావతి చంద్రబాబును కలిశారు. రేపు ఉదయం తన కుమార్తెకు పరీక్ష ఉందని చేతిలో చిల్లిగవ్వలేదని చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ నేత ప్రభావతిని ఓదార్చిన చంద్రబాబు వెంటనే ఆమెకు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమయ్యారు. కుమార్తె చదువు ఆగిపోకూడదని ప్రభావతికి అక్కడిడక్కడే రెండు లక్షల 30 వేల రూపాయల ఆర్దిక సాయం అందజేశారు. దీంతో వెంటనే తాను వైసీపీ కండువాని ఈ క్షణమే తీసేసి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటానని ప్రభావతి చెప్పారు. ఈ సందర్భంగా తాను సాయం చేసేటప్పుడు పార్టీలు చూడనని చంద్రబాబు చెప్పారు.