TDP : టిక్కెట్లు రాని నేతలకు పార్టీ పదవులు.. ఉత్తర్వులు జారీ చేసిన టీడీపీ
ఎన్నికల్లో టిక్కెట్లు రాని నేతలకు పార్టీ పదవులు ఇస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు
tdp, candidate, mlc of local bodies, visakha district
ఎన్నికల్లో టిక్కెట్లు రాని నేతలకు పార్టీ పదవులు ఇస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రెడ్డి సుబ్రహ్మణ్యంను పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారు. కె.ఎస్ జవహర్ ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గండి బాబ్జీని విశాఖపట్నం పార్లమెంటు పార్టీ అధ్యక్షులుగా నియమించారు.
పార్టీ కార్యదర్శులుగా...
బి.వి. వెంకట్రాముడును హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడిగా, రాష్ట్ర పార్టీ కార్యకర్యనిర్వాహక కార్యదర్శులుగా సీఎం సురేష్, మననే సుబ్బారెడ్డి, యతిరాజా రామ్మోహన్ నాయుడు, ముదునూరి మురళీ కృష్ణరాజు, వాసురెడ్డి ఏసుదాసులను నియమిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.