నేటి నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు
నేటి నుంచి శ్రీశైలంలో ఐదు రోజులపాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి
నేటి నుంచి శ్రీశైలంలో ఐదు రోజులపాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఉగాది ఉత్సవాల్లో నిత్యం స్వామి అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. ఉగాది ఉత్సవాలు తిలకించేందుకు అత్యధిక సంఖ్యలో కన్నడ భక్తులు తరలివస్తున్నారు. కన్నడ భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
కన్నడ భక్తులు...
శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు నల్లమల అడవుల మీదుగా నడిచి వస్తున్న వేలమంది కన్నడ భక్తులకు భద్రతను కూడా కల్పిస్తున్నారు. ఉగాది వేళ శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటే మంచి జరుగుతుందని కన్నడ భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఎక్కువ సంఖ్యలో తరలి వస్తున్నారు.