ఢిల్లీలో పయ్యావుల బిజీబిజీ
ఢిల్లీ పర్యటనలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బిజీగా గడుపుతున్నారు
ఢిల్లీ పర్యటనలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బిజీగా గడుపుతున్నారు. కేంద్ర ఆర్థికశాఖ వివిధ విభాగాల ఉన్నతాధికారులతో పయ్యావుల కేశవ్ వరస భేటీలు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక సాయం, పెండింగ్ నిధుల విడుదలపై కేంద్రానికి వినతులు సమర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కొన్ని వెసులుబాట్లు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కేంద్ర నిధుల వినియోగంపై...
రాష్ట్రంలో కేంద్ర నిధుల వినియోగంపై అధికారులకు వివరించిన పయ్యావుల కేశవ్, రాయలసీమలోని వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయంపై చర్చించారు. రాయలసీమ హార్టీకల్చర్ హబ్‌కు సాయంపై విజ్ఞాపనలు అందించిన పయ్యావుల కేశవ్ మరింతగా ఆర్థిక సాయాన్ని ఏపీకి అందించాలని కోరుతున్నారు.