Tiger : పులి సంచారం హెచ్చరికలు
పులి సంచారం హెచ్చరికలతో అన్నవరం దేవస్థానం, అటవీ, పోలీసులు అప్రమత్తమయ్యారు.
పులి సంచారం హెచ్చరికలతో అన్నవరం దేవస్థానం, అటవీ, పోలీసులు అప్రమత్తమయ్యారు. కొండపై భక్తులు అప్రమత్తంగా ఉండాలని మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఘాట్ రోడ్డు, మెట్ల మార్గంలో భక్తులు ఒంటరిగా నడిచి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. కాకినాడ జిల్లాలో పులి సంచారం గత కొద్ది రోజుల నుంచి అలజడి సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
వాహనాలు నిలపవద్దంటూ...
ఘాట్ రోడ్డులో ఎక్కడా వాహనాలు నిలపవద్దని హెచ్చరించారుర. వసతి గదుల్లో నుంచి రాత్రి వేళల్లో బయటకు రావొద్దని సూచించారు. భక్తులు, గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించిన అధికారులు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పులి సంచారంతో ఇప్పటికే అటవీ శాఖ అధికారులు దానిని బంధించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారని, అప్పటి వరకూ ప్రజలు, భక్తులు జాగ్రత్తలు పాటించాలని దేవాలయ అధికారులు తెలిపారు.