సిట్‌ ఎదుట విచారణకు లక్ష్మీదుర్గ

సిట్‌ ఎదుట విచారణకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ హాజరయ్యారు.

Update: 2026-03-16 07:27 GMT

సిట్‌ ఎదుట విచారణకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ హాజరయ్యారు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్యకేసులో లక్ష్మీదుర్గ అలియాస్‌ రోజాను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇద్దరు న్యాయవాదులతో కలిసి కార్యాలయంలోకి లక్ష్మీదుర్గ వచ్చారు. లక్ష్మీదుర్గను కార్యాలయం వద్ద వదిలిపెట్టి ఆమె భర్త అనంతబాబు వెళ్లారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏ-1 అనంతబాబు, ఏ-2 లక్ష్మీదుర్గగా పోలీసులు పేర్కొన్నారు.

డోర్ డెలివరీ చేసిన కేసులో...
సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్‌ డెలివరీ చేసిన కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు పోలీసుల గుర్తించారు. ఏ2గా చేర్చి రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ కొట్టివేయాలని లక్ష్మీదుర్గ హైకోర్టును ఆశ్రయించారు.ఈరోజు నుంచి ఈనెల 30 వరకు సిట్‌ ఎదుట, 30న కోర్టులో విచారణకు రావాలని తీర్పు చెప్పడంతో కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ సిట్‌ ఎదుట లక్ష్మీదుర్గ విచారణకు హాజరయ్యారు. విచారణ అధికారిగా ఐపీఎస్‌ అధికారి, ఎస్‌డీపీవో మనీశ్‌ పాటిల్‌ దేవరాజ్‌ వ్యవహరించారు. కాకినాడలోని ఎస్‌డీపీవో కార్యాలయంలో అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ విచారణ చేస్తున్నారు.





Tags:    

Similar News