Andhra Pradesh : నేటి నుంచి ‘రైతన్నా... మీ కోసం’
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచే ‘రైతన్నా... మీ కోసం’ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచే ‘రైతన్నా... మీ కోసం’ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ నుంచి 10 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. వ్యవసాయ శాఖ అధికారుల నేతృత్వంలో ఈ సదస్సులు జరగనున్నాయి. సాగులో అవసరమైన చర్యల గురించి రైతులకు అవగాహన కల్పించనుంది.
ముగింపు సభలో...
ఈ నెల 25వ తేదీన ముగింపు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. 32 రకాల విత్తనాల పంపిణీ మరియు సాగుపై కీలక సూచనలను అన్నదాతలకు చేయనున్నారు. ఎల్‌నినో ప్రభావంపై రైతులకు ముందస్తు హెచ్చరికలు కూడా ఈ సదస్సులో అధికారులు వివరించనున్నారు.