Andhra Pradesh : ఏపీలో ఆస్తిపన్ను వడ్డీ రాయితీ ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పన్ను విషయంలో ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2026-03-17 03:11 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పన్ను విషయంలో ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్ను వడ్డీ పై యాభై శాతం రాయితినిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఇంటి పన్ను బకాయిదారులందరూ ఏక మొత్తంలో ఇంటి పన్ను మరియు వడ్డీ చెల్లించినచో, వడ్డీ పై 50 శాతం రాయితీని పొందవచ్చని అన్నారు.

ఈ నెలాఖరు వరకే...
ఈ అవకాశం మార్చి 31, 2026 వరకు మాత్రమే అని, ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పన్ను చెల్లింపులకు విజయవాడ నగర పరిధిలో గల అన్ని క్యాష్ కౌంటర్లలోనూ, మరియు మీ దగ్గరలోని సచివాలయాల్లోనూ, ఆన్ లైన్ లో (www.cdma.ap.gov.in లేదా www.ourvmc.org) కూడా చెల్లించవచ్చని తెలిపారు. వెంటనే చెల్లించి రాయితీ పొందాలని కోరుతున్నారు.


Tags:    

Similar News