అక్క ఆరాటమే కానీ..న్యాయ పోరాటం ఎక్కడ?

సీబీఐ వారికి నచ్చిన వారిని మాత్రమే విచారణ చేసిందని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అన్నారు

Update: 2026-03-16 11:55 GMT

సీబీఐ వారికి నచ్చిన వారిని మాత్రమే విచారణ చేసిందని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అన్నారు. జగన్ ను సీఎంగా, అవినాశ్ రెడ్డినిఎంపీగా చేస్తానని వైఎస్ వివేకానందరెడ్డి చెప్పారని వైఎస్ సునీత తొలుత స్టేట్ మెంట్ ఇచ్చిమళ్లీ ఎందుకు మార్చారని ఆయన ప్రశ్నించారు. ట్రయల్ ను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు. చంద్రబాబుకు మేలు జరగాలనే ఇలా వైఎస్ సునీత ప్రయత్నిస్తుందని వైఎస్ అవినాశ్ రెడ్డి అన్నారు. వాస్తవాలు బయటకు రావాలంటే ట్రయల్ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.వైఎస్ వివేకానందరెడ్డికి ఉన్న వివాహేతర సంబంధాలపై సీబీఐ ఎలాంటి విచారణ చేయలేదని అన్నారు.

చంద్రబాబుకు రాజకీయ లబ్ది చేకూర్చేందుకే...
దస్తగరి, డ్రైవర్ ప్రసాద్, దస్తగిరి రెండో భార్య స్టేట్ మెంట్ ను ఎందుకు రికార్డు చేయలేదని తెలిపారు. ఒకసారి ఇచ్చిన వాంగ్మూలాన్ని మళ్లీ మార్చేందుకు సీబీఐ ఎలా అవకాశమిచ్చిందని వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వన్ సైడ్ విచారణను సీబీఐ చేసిందని అన్నారు. డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ దొరికిపోవడంతో మళ్లీ దానిని పక్క దోవపట్టించేందుకు మళ్లీ వైఎస్ సునీత ముందుకు వచ్చిందని వైఎస్ అవినాశ్ రెడ్డి అన్నారు. రాజకీయంగా చంద్రబాబుకు ప్రయోజనం చేయాలని ఆరాటం తప్ప, సునీతకు న్యాయ పోరాటం చేయడం లేదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి రాసిని చివరి లేఖను ఎందుకు దాచి పెట్టారని వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రశ్నించారు. పన్నెండు సార్లు తనను సీబీఐ తనను విచారించిందని, తన వాదనలను సీబీఐ వినిపించుకోలేదని అవినాశ్ రెడ్డి అన్నారు. గత కొన్నేళ్లుగా తమను ఎందరో ఈ కేసు విషయంలో తనను దూషించారని, ఏదో ఒకరోజు నిజం బయటకు వస్తుందని వైఎస్ అవినాశ్ రెడ్డి అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పింది సునీతేనని ఆయన అన్నారు.


Tags:    

Similar News