Chandrababu : తమ్ముళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు
తెలుగుదేశం పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తలు, నేతల పేర్లను పంపించాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని తెలిపారు. పేర్లను సిఫారసు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. అన్ని ప్రధాన దేవాలయాల్లో ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.
పార్టీకి కష్టపడిన వారికి...
త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారి వివరాలను పదవుల కోసం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సరైన పేర్లను, కష్టపడిన వారి పేర్లను మాత్రమే సిఫార్సు చేయాలని సూచించారు. నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీ చేస్తామన్న ఆయన తాను అన్న మాటలను కొందరు వక్రీకరిస్తున్నారని తెలిపారు. ఏ స్థాయిలో కూడా వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీకి ఓటేసిన వారికి పథకాలు ఇవ్వొద్దని చెప్పినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్ష ఉండదని, పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.