నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ ఛార్జిషీట్
నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ పై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది
నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ పై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. విజయవాడ కోర్టులో సిట్ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.జోగి బ్రదర్స్ తో పాటు 13 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. నకిలీ మద్యం కేసులో ఇప్పటికే జోగి బ్రదర్స్ అరెస్టయి విజయవాడ కోర్టులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
పది పేజీలతో కూడిన...
కాల్ డేటా, ఆర్థిక లావాదేవీల వివరాలతో 10 పేజీల సిట్ చార్జ్ షీట్ దాఖలు చేసింది. మరొకవైపు జోగి రమేష్ తో పాటు అతని సోదరుడు పలుసార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా లభించలేదు. అయితే ఛార్జిషీట్ దాఖలు కావడంతో బెయిల్ వచ్చే అవకాశముంటుందని న్యాయవాదులు చెబుతున్నారు. ఈరోజు, రేపట్లో జోగి బ్రదర్స్ తరుపున న్యాయవాదులు బెయిల్ పిటీషన్ వేసే అవకాశముంది