Chandrababu : అధికారులకు చంద్రబాబు అభినందనలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు అభినందనలు తెలిపారు

Update: 2026-01-01 03:34 GMT

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రభుత్వ అధికారులకు, గ్రామ సచివాలయ సిబ్బందికి, గ్రామస్థాయి ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా పేదల ఇళ్లల్లో సంతోషం నింపేందుకు ఒకరోజు ముందుగానే పింఛన్లు ఇవ్వాలనే ప్రభుత్వ ఆలోచనను చక్కగా అమలు చేశారని పేర్కొన్నారు.

పింఛన్ల పంపిణీకి...
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా ఆర్థిక భరోసా ఇవ్వాలనేదే ప్రభుత్వ సంకల్పం అని చంద్రబాబు అన్నారు. నేడు పింఛన్లు అందుకున్న లబ్దిదారులు అందరికీ మరోసారి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పింఛన్లు అందించిన ప్రభుత్వ సిబ్బంది అందరికీ చంద్రబాబు అభినందనలు తెలియజేయడమే కాకుండా వారికి నూతన సంవత్సర అభినందనలు తెలిపారు.


Tags:    

Similar News