తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష

తాడిపత్రి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక రోజు దీక్షకు దిగారు.

Update: 2026-01-01 07:08 GMT

తాడిపత్రి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక రోజు దీక్షకు దిగారు. తాడిపత్రిలోని గాంధీ బొమ్మ సెంటర్ లో ఆయన ఒకరోజు దీక్ష చేపట్టారు. తాను జనవరి 1వ తేదీ నూతన ఏడాది దీక్షకు దిగుతానని జేసీ ప్రభాకర్ రెడ్డి ముందుగానే ప్రకటించారు. అయితే ఆయన ఎందుకు దీక్షకు దిగారో మాత్రం కారణాలు ప్రకటించలేదు. నా ఒక్కరోజు దీక్ష ప్రజల కోసం అని ఫ్లెక్సీని శిబిరం వద్ద ఏర్పాటు చేశారు.

ఒకరోజు దీక్షకు...
ఉదయం ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో దీక్షకు కూర్చున్నారు. దీక్షకు దిగిన కారణాలు మాత్రం ఇప్పటికీ ఆయన ప్రకటించలేదు. ఆయన దీక్ష విరమించిన తర్వాత మీడియా సమావేశంలో ప్రకటించే అవకాశముంది. అదే సమయంలో తాడిపత్రి మున్సిపాలిటీకి సంబంధించి దీక్షా శిబిరంలో ఆదాయ, వ్యాయాలను ప్రకటించడం చర్చనీయాంశమైంది.


Tags:    

Similar News