Tirumala : టీటీడీకి కోటి రూపాయల విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానానికి కోటి రూపాయల విరాళాన్ని లావు రత్తయ్య అందించారు

Update: 2025-12-31 08:20 GMT

తిరుమల తిరుపతి దేవస్థానానికి కోటి రూపాయల విరాళాన్ని లావు రత్తయ్య అందించారు. టీటీడీ ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ కు కోటి రూపాయల విరాళాన్ని అందచేశారు. తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడుని కలిసి కోటి రూపాయల విరాళం డిడిని విజ్ఞాన్స్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య అందచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న సేవలను కొనియాడారు.

విజ్ఞాన్ సంస్థల అధిపతి రత్తయ్య...
కోటి రూపాయలతో తిరుమల తిరుపతి దేవస్థానం విద్యాదానం అందించాలని, నిరుపేద విద్యార్థులకు విద్యను అందించడంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం అయితే సక్రమంగా నిధులు సద్వినియోగమవుతాయని భావించి కోటి రూపాయలు విరాళం ఇచ్చినట్లు లావు రత్తయ్య ప్రకటించారు. విజ్ఞాన్స్ సంస్థ తరపున విరాళం అందజేసిన దాతను న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు.


Tags:    

Similar News