Andhra Pradesh : ఎస్సీ లకు ఏపీ సర్కార్ తీపి కబురు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ కులాల వారికి గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ కులాల వారికి గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో తీసుకున్న రుణాలపై ఉన్న వడ్డీని మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక సంక్షేమ శాఖ ద్వారా 11,479 మంది షెడ్యూల్డ్ కులాల రుణాలు లబ్ధిదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సుమారు193.40 కోట్లు ఎన్ఎస్ఎఫ్డీసీ, 66.04 కోట్లు ఎన్ఎస్కేఎఫ్ డిసీ నిధులతో రుణాలు గతంలో మంజూరు చేసిన వారికి ఈ నిర్ణయం వర్తిస్తుంది.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా...
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా.. జాతీయ ఎస్సీ కార్పొరేషన్, జాతీయ సఫారీ కర్మచారి అభివృద్ధి కార్పొరేషన్ నుంచి తీసుకున్న రుణాలపై ఉన్న వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం మాఫీ చేసింది. అయితే ఒక షరతు మాత్రం విధించింది. తీసుకున్న రుణానికి సంబంధించిన అసలు మొత్తాన్ని 4 నెలల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. మార్చి-ఏప్రిల్ 2026 లోపు అసలు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కోవిడ్-19 మహమ్మారి ప్రభావం వల్ల లబ్ధిదారులు ఆర్థికంగా నష్టపోయి రుణాలను తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.