Polavaram : పోలవరం ప్రాజెక్టుకు విదేశీ నిపుణులు
పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు విదేశీ నిపుణులు రానున్నారు.
పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు విదేశీ నిపుణులు రానున్నారు. ఈ నెల 22 నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించనున్న నిపుణుల బృందం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాదికి పోలవరం నుంచి నీరు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వానికి నివేదిక...
ఈ నేపథ్యంలో విదేశీ నిపుణుల పరిశీలన తర్వాత మరింత పనులు ఊపందుకోనున్నాయి. అనంతరం ఢిల్లీలో పోలవరం ఉన్నతాధికారులతో నిపుణులు భేటీకానున్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ పనులు చేపట్టింది. అయితే గతంలో పోలవరం ప్రాజెక్టు లో ఏర్పడిన లోపాలను పరిశీలించి అధ్యయనం చేసి నివేదిక అందించనుంది.