జనవరి 19కి వాయిదా.. నెక్స్ట్ ఏంటి?

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ

Update: 2023-12-08 11:25 GMT

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై నేడు విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. విచారణలో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. తాము కౌంటర్ దాఖలుకు సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. ఈ కేసు వ్యవహారం 17ఏ తీర్పుతో ముడిపడి ఉందని సాల్వే ప్రస్తావించారు. చంద్రబాబుకు ధర్మాసనం గతంలో నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్ వేయలేదని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు ముగిసిన అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ దీనిపై విచారణను జనవరి మూడో వారంలో చేపడతామని తెలిపింది. దాంతో, తేదీ ఖరారు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టును కోరారు. సాల్వే విజ్ఞప్తితో విచారణను జనవరి 19కి వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది.

స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటీషన్ వేసింది


Tags:    

Similar News