Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి
స్క్రబ్ టైఫస్ వ్యాధి ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తుంది
స్క్రబ్ టైఫస్ వ్యాధి ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తుంది. ఏ మాత్రం అలక్ష్యం చేసినా ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆంధ్ర_ప్రదేశ్ లో స్క్రబ్ టైఫస్ జ్వరాలతో బాధపడే వారు చాలా మంది ఉన్నారు. దాదాపు అన్నిజిల్లాల్లో కేసున్నాయి. ఈ వ్యాధి ని గుర్తించడం లోనే జాప్యం జరగడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. చిత్తూరు -కాకినాడ -విశాఖ లలో ఎక్కువ కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రతి జిల్లాలోనూ వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ముందుగా గుర్తిస్తే స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి భయాందోళనలు చెందాల్సిన అసవరం లేదని చెబుతున్నారు.
ఇలా సోకుతుందట...
ఓరియంటియా సుట్సుగాముషి అనే బాక్టీరియా వల్ల వస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఈ బాక్టీరియా...చిగ్గర్ మైట్ల లో పెరుగుతాయి. ఆ చిగ్గర్ మైట్లంటే...ఆరుద్ర పురుగులవంటివి. ఈ పురుగులు ఆరుద్ర పురుగులకంటే చిన్నగా ఉంటాయి. మనం మామూలుగా కంటితో చూడగలిగినా...పట్టించుకోము. ఎక్కువగా పొదలు,గడ్డి,తడినేలలు, వృధాగా ఉన్న భూములు, మొక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ చిగ్గర్ మైట్ పురుగులు ఉంటాయి. మామూలుగా అయితే ఎలుకలు, పందికొక్కులు, ఇతర జంతువులను ఇవిఎక్కువగా కుట్తాయి. కాబట్టి...సుట్సుగాముషి బాక్టీరియా ఆయా జంతువులలో పెరిగి...జబ్బులు వస్తుంటాయి.ఏ కారణం చేతైనా...మనం అలాంటి గడ్డి ప్రదేశాలలో కూర్చోడం, తోటపని చేసేప్పుడు, పశువుల పాకల్లో, వ్యర్ధాలు తొలగిస్తున్నప్పుడో, కుక్క -గొర్రె -మేక లను స్పృశిస్తున్నప్పుడో ఆ చిగ్గర్ పురుగులు...మనల్ని కుట్తాయని చెబుతున్నారు.
ప్రాధమికంగా గుర్తిస్తే...
అది కుట్టినప్పుడు పెద్ద నొప్పి కూడా ఏమీ వేయదు. పెద్దగా పట్టించుకోరు. అందుకే తోట పని చేసేప్పుడు రక్షణ కవచాలు...గ్లవ్స్, లెగ్గిన్స్ ధరించాలని వైద్యులు చెబుతున్నారు. చిగ్గర్ పురుగు కుట్టిన ఆరు నుంచి 12 రోజులలో జ్వరం వస్తుంది. కుట్టిన చోట నల్లటి దద్దురు లాగా వస్తుంది. శరీరం మీద సన్నటి దుద్దుర్లు వస్తాయి. జ్వరం, వణుకుతో వస్తుంది. తలనొప్పి, కండరాల నొప్పి, జలుబు, దగ్గు, ఉండదు. వాంతులు, విరేచనాలు కూడా కొందరిలో కలుగవచ్చు. ఈ దశలోనే వ్యాధిని గుర్తించాల్సి ఉంటుంది. అప్పుడు చికిత్స సులువు అని వైద్యులు చెబుతున్నారు. ఎలాగూ ఏ జ్వరమైనా .ఏదో ఒక యాంటీ బయటిక్ పెట్టాల్సిందే.ఆ పెట్టేదేదో....డాక్సీసైక్లిన్ వాడితే సరిపోతుందని వైద్యుులు చెబుతున్నారు. డాక్సీ సైక్లిన్ 100 మిల్లీగ్రామ్స్ క్యాప్సూల్స్ ఏదైనా తిన్నాక ప్రొధ్ధున ఒకటి రాత్రి ఒకటి చొప్పున 2 వారాలు వేసుకుంటే సరి పోతుందంటున్నారు.
ఈ మందులతో...
కొంతమందికి డాక్సీ సైక్లిన్ పడదు. వారు అజిత్రోమైసిన్ వాడొచ్చు. 500 మిల్లీగ్రాంస్ టాబ్లెట్..రోజుకొకటి చొప్పున వారం రోజులు వాడితే చాలు. పిల్లలకు...గర్భిణీ స్త్రీలకు -పాలిచ్చే తల్లులకు....కూడా అజిత్రోమైసిన్ అయితే మంచిది. కానీ డాక్సీ సైక్లిన్ మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.వ్యాధిని గుర్తించ లేకపోయినా, సరైనసమయంలో చికిత్స అందించకపోయినా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశముంది. ఇది అంటువ్యాధి కాదు. మనిషి నుంచి మనిషికి సోకదు. కాస్త తోట పని...పశువుల పాకల పని...చెత్త తొలగింపు చేసేప్పుడు...రక్షణగా గ్లవ్స్ వేసుకోవడం మంచిది. పార్కుల్లో...తోటల్లో పడి తిరగడాలు..దొర్లడాలు కొన్ని రోజులైనా మానేస్తే మంచిదని సూచిస్తున్నారు. ఈ వ్యాధి రాకుండా ఎటువంటి వ్యాక్సిన్లూ లేవని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు.