Ys Jagan : నేడు జోగి రమేష్ ఇంటికి జగన్.. పోలీసులు ఆంక్షలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడ వెళ్లనున్నారు

Update: 2026-02-06 02:33 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడ వెళ్లనున్నారు. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్నారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. ఇటీవల జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు పెట్రోలు బాంబులతో దాడి చేసిన ఘటనపై కుటుంబ సభ్యులను కలసి తెలుసుకోనున్నారు. అయితే రెండు రోజుల క్రితం గుంటూరు పర్యటనలో భారీగా కార్యకర్తలు వచ్చి, ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజలు ఇబ్బందులు పడినందున ఈరోజు పోలీసులు జగన్ పర్యటనపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ట్రాఫిక్ రద్దీ కారణంగా....
విజయవాడలో ట్రాఫిక్ రద్దీ కారణంగా వేరే రూట్లో వెళ్లాలని జగన్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరతారు.ఉదయం పదకొండు గంటలకు ఆయన ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు. తిరిగి అక్కడి నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయలుదరి తాడేపల్లికి చేరుకుంటారు. అయితే ట్రాఫిక్ సమస్యల కారణంగా వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. మరి జగన్ ఎటు వైపు నుంచి బయలుదేరతారన్నది చూడాలి.


Tags:    

Similar News