Chandrababu : చంద్రబాబుకు మోదీ, జగన్, చిరంజీవిల స్పెషల్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ, చిరంజీవి, జగన్ లు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు

Update: 2025-04-20 05:34 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. "నా స్నేహితుడు చంద్రబాబుకకు పుట్టినరజు శుభాకాంక్షలు. భవిష్యత్ రంగాలపై ఆయన దృష్టి సారించి పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం అవిశ్రాంతంగా పనిచేస్తున్న చంద్రబాబు పనితీరు ప్రశంసనీయం, ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా" అంటూ మోదీ ట్వీట్ చేశారు.

ఆయురారోగ్యాలతో...
అలాగే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా చంద్రబాబు నాయుడుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరు కుంటున్నాన్నట్లు ఎక్స్ వేదికగా జగన్ ట్వీట్ చేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన దార్శనికత, పట్టుదల, అంకిత భావం ఉన్న అరుదైన నాయకుడని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.


Tags:    

Similar News