Ys Jagan : జగన్ బంగారుపాళ్యం పర్యటనపై పోలీసులు కేసు నమోదు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2025-07-11 07:43 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు పెట్టిన ఆంక్షలను ఉల్లంఘించి పర్యటన చేపట్టారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. చిత్తూరు జిల్లాలోని తోతాపూరి మామిడి రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో జగన్ వారితో మాట్లాడేందుకు బంగారుపాళ్యం వెళ్లారు.

అనుమతికి మించి...
అయితే పొదిలి, రెంటపాళ్ల ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ వద్ద ముప్ఫయి మందికి, బంగారు పాళ్యం మామిడి మార్కెట్ వద్దకు ఐదు వందలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ అనుమతులకు మించి ప్రజలు అక్కడకు రావడంతో నిర్వాహకులపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ టీవీ కెమెరాలను పరిశీలించి మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశముంది.


Tags:    

Similar News