Andhra Pradesh : లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక అప్ డేట్

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక నిందితుడు దిలీప్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Update: 2025-05-01 12:37 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నై ఎయిర్ పోర్టులో సిట్ అధికారుల అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి పర్సనల్ అసిస్టెంట్ దిలీప్ ను చెన్నై ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను విజయవాడకు తీసుకు వస్తున్నారు.

కీలకంగా మారిన నిందితుడిని...
రాజ్ కసిరెడ్డి పీఏ గా ఉన్న దిలీప్ ఈ కేసులో కీలకంగా మారనున్నారని సీఐడీ అధికారులు అంచనా వేస్తున్నారు. పైలా దిలీప్ ను అదుపులోకి తీసుకోవడం ద్వారా మరికొంత సమాచారాన్ని రాబట్టే అవకాశముందని భావిస్తున్నారు. ఫోన్ లొకేషన్ ద్వారా దుబాయ్ కు పారిపోయేందుకు ప్రయత్నించగా దిలీప్ ను చెన్నై ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. రేపటి నుంచి రాజ్ కసిరెడ్డిని వారం రోజుల పాటు సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని మద్యం స్కామ్ విషయంలో ప్రశ్నించే అవకాశముంది.


Tags:    

Similar News