కాకాణి కోసం ఆరు పోలీసు బృందాలు

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు

Update: 2025-04-10 11:57 GMT

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన కోసం పోలీసులు మొత్తం ఆరు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. మైనింగ్ కేసులో కాకాణి గోవర్థన్ రెడ్డిపై కేసు నమోదయన సంగతి తెలిసిందే. అదే సమయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదయింది. పోలీసుల విచారణకు హాజరు కాకుండా ఆయన తప్పించుకు తిరుగుతున్నారు.

లుక్‌ఔట్‌ నోటీసులు...
దీంతో కాకాణి గొవర్థన్ రెడ్డిపై పోలీసుల లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్‌పోర్ట్‌లు, సీపోర్టులకు పోలీసుల సమాచారం అందించారు.మూడుసార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాకపోవడంతో కాకాణి గోవర్థన్ రెడ్డి విషయంలో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే హైకోర్టులో కాకాణి ముందస్తుబెయిల్ తిరస్కరించడంతో ఆయన కోసం గాలిస్తున్నారు.


Tags:    

Similar News