Perni Nani : పేర్ని నానిపై కేసు నమోదు

మాజీ మంత్రి పేర్ని నానిపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదుచేశారు

Update: 2025-10-11 04:50 GMT

మాజీ మంత్రి పేర్ని నానిపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదుచేశారు. పోలీస్ స్టేషన్ లో సీఐ విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై పేర్నినానితో పాటు మరొక ఇరవై తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నం ఆర్ఆర్ పేటలో్ ఈ కేసు నమోదయింది. మచిలీపట్నం వైసీపీ నేత సుబ్బన్న అరెస్ట్ పై నిన్న పేర్ని నాని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.

విధుల్లో ఉన్న సీఐతో వాగ్వాదం...
అక్కడ విధుల్లో ఉన్న సీఐతో వాగ్వాదానికి దిగారు. ప్రతి రోజూ పోలీసులకు పిలిచి వేధించడమేంటని పేర్ని నాని పోలీసులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా పేర్నినాని, సీఐలకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే పోలీసులపై నాని బెదిరింపులకు దిగారని ఎస్పీ ఆరోపించగా, సీఐ తనపై రెచ్చగొట్టేలా వ్యవహరించారని, తాను సమన్వయం కోల్పోలేదని, మర్యాదపూర్వకంగానే ప్రవర్తించానని తెలిపారు.


Similar News