Pawan Kalyan : క్షణాల్లోనే పవన్ రెస్పాన్స్.. అదిరింది కదా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొన్ని విషయాల్లో వెంటనే స్పందిస్తారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొన్ని విషయాల్లో వెంటనే స్పందిస్తారు. అంథ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తమ గ్రామానికి రోడ్డులేదని, మట్టిరోడ్డే దిక్కయిందని, రహదారి సౌకర్యాన్ని కల్పించాలని పవన్ కల్యాణ్ ను కోరారు. నిన్న ఉదయం దీపిక ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకు రాగా, సాయంత్రానికి అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మూడు కోట్ల అంచనా...
దీపిక స్వగ్రామం అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం హేమావతి పంచాయతీ పరిధిలోని తంబాలహట్టి రోడ్డును వెంటనే బాగు చేయడానికి 3.20 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మానానికి మూడు కోట్లు రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేసిన అధికారులు వెంటనే పరిపాలనపరమైన అనుమతులు మంజూరు చేశారు.