Pawan Kalyan : తెలంగాణను సంక్రాంతికి ఆహ్వానించండి.. ఆతిథ్యం ఇవ్వండి
సంక్రాంతికి తెలంగాణ వాళ్లను ఆహ్వానించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరారు
సంక్రాంతికి తెలంగాణ వాళ్లను ఆహ్వానించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరారు. పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. తెలంగాణ వాళ్లకు గోదావరి జిల్లాల వారి ప్రేమను పంచమని అన్నారు. గోదావరి ఆతిథ్యం ఇవ్వాలని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో ఈ చిన్న ఆకు కదిలినా అది వార్త అవుతుందని అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చూడాలని కోరారు. ఏదైనా కూలగొట్టడం తేలిక అని, నిలబెట్టడం కష్టమని అన్నారు.
పిఠాపురంలో ఏం జరిగినా...
విపక్ష సభ్యుల నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా తెలియదని పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురంలో పక్షి ఈక పడినా అది వార్త అవుతుందని అన్నారు. ఈ ప్రచారాన్ని మీరు కూడా సోషల్ మీడియాలో పంచుకోవద్దని సూచించారు. పనిచేసే నాయకులకు వెన్నంటి ఉండకపోతే పనులు జరగవని పవన్ కల్యాణ్ అన్నారు. వంద ప్రాజెక్టులు ప్రభుత్వానికి ఉంటాయని, ప్రాధాన్యత క్రమంలో అన్నింటినీ చేసుకుంటూ వస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. దేశం కోసం పనిచేసేవాడని.. పండగలకు.. పబ్బాలకు రాలేదనడం ఎంత వరకూ సమంజసమని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. గొడవ పెట్టుకోదలచుకోవాలంటే ఎప్పుడైనా తాను సిద్ధమేనని పవన్ కల్యాణ్ అన్నారు. వ్యవస్థ కోసం పాటుపడితే తనకు అభ్యంతరం ఏముంటుందని పవన్ కల్యాణ్ అన్నారు.