కావూరి మృతిపట్ల లోకేశ్ సంతాపం

కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు మృతి చెందారు

Update: 2026-03-11 07:24 GMT

కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు మృతి చెందారు. కావూరి సాంబశివరావు కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. ఐదు సార్తు ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఏలూరు, మచిలీపల్నం పార్లమెంటు నియోజకవర్గాల నుంచి గెలిచిన కావూరి సాంబశివరావు కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు గారి మృతిపట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు.

ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసి...
కావూరి సాంబశివరావు మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఐదుసార్లు ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర ప్రగతి కోసం ఎనలేని కృషి చేశారన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని, కావూరి సేవలు చిరస్మరణీయమని, వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని నారా లోకేశ్ పేర్కొన్నారు.


Tags:    

Similar News