Nara Lokesh : ఢిల్లీలో నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీకి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న లోకేశ్ కు తమ పార్టీకి చెందిన ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులతో లోకేశ్ సమావేశమయ్యారు. రాజకీయ పరిణామాలపై లోకేశ్ వారితో చర్చించారు. ఎంపీలతో భేటీ అయిన లోకేశ్ ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావం ఏపీపై పడే అంశంపై కూడా చర్చించినట్లు తెలిసింది.
ఢిల్లీలో జరగనున్న...
ఈరోజు మెటా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాట్సప్ సిటిజన్ ఎంగేజ్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫోరమ్ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొననున్నారు. ఈరోజు సాయంత్రం బయలుదేరి విశాఖకు లోకేశ్ చేరుకుంటారు. లోకేశ్ రేపు విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం తిరిగి అమరావతికి చేరుకుంటారనిపార్టీవర్గాలు వెల్లడించాయి.