Pawan Kalyan : నేటి నుంచి మూడు రోజులు పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ప్రజాసమస్యల పరిశీలనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అలాగే వివిధ పనులకు సంబంధించి శంకుస్థాపనలు చేయనున్నారు. రేపు పిఠాపురానికి పవన్ వెళ్లనున్నారు. పిఠాపురంలో జరిగే సంక్రాంతి వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.
మూడు రోజుల పాటు...
అక్కడి ప్రజలు, కార్యకర్తలతో కలసి సంక్రాంతి వేడుకలలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. అలాగే పిఠాపురం ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులసమస్యలను తెలుసుకోనున్నాు. ఈ నెల 10వ తేదీన జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పదోతేదీన రంగారాయ మెడికల్ కళాశాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. పవన్ కల్యాణ్ పర్యటనలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.