పాపికొండల విహార యాత్రకు ఓకే
పర్యాటకులకు టూరిజం శాఖ అధికారులు తీపికబురు చెప్పారు. పాపికొండల విహారయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది
పర్యాటకులకు టూరిజం శాఖ అధికారులు తీపికబురు చెప్పారు. పాపికొండల విహారయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. గోదావరి వరద నీటి ఉధృతి తగ్గడంతో తిరిగి పాపికొండల విహార యాత్ర ప్రారంభమవుతుందని పర్యాటక శాఖ అధికారులు చెప్పారు. మూడు నెలల నుంచి పాపికొండల యాత్ర నిలిచిపోయింది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు, ఏపీ, తెలంగాణలలో ఆగస్టు నెల నుంచి మొదలయిన కుండపోత వర్షాలతో గోదావరి నది ఉధృతిగా ప్రవహిస్తుంది. ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద, భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
గోదావరి వరద నీరు తగ్గడంతో...
అంతే కాదు లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి గేట్లు ఎత్తి విడిచిపెట్టారు. దీంతో పాపికొండల యాత్రను పర్యాటక శాఖ నిలిపేసింది. వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తుండటంతో ప్రమాదం జరిగే అవకాశముందని పాపికొండల యాత్రకు బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం గోదావరి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో పాటు ప్రయాణానికి అనుకూలంగా మారడంతో టూరిజం శాఖ పాపికొండల యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై పాపికొండల విహార యాత్రకు వెళ్లాలనుకున్న వారు ఇటు భద్రాచలం వెళ్లి కాని, అటు రాజమండ్రి నుంచి కాని బోట్లలో వెళ్లి చూసే అవకాశముంది.