ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పవన్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాతో పాటు వివిధ వేదికల ద్వారా వైరల్ అవుతున్న పోస్టులను వారం రోజుల్లోగా తొలగించాని ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.
వారం రోజుల్లో...
తాను తొలగించాలని కోరుకుంటున్న యూఆర్ఎల్స్ ను సోషల్ మీడియా సంస్థలకు అందించాలని పవన్ తరుపున న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశించింది. ఇందుకు నలభై ఎనిమిది గంటల సమయం ఇచ్చింది. ఇటీవల వరసగా సెలబ్రిటీలు తమపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పెడుతున్న సోషల్ మీడియా పోస్టులపై చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మితిమీరి పోస్టులు పెట్టడమే కాకుండా వారి అభిమానుల ఆగ్రహానికి కూడా కారణమవుతుండటంతో సెలబ్రిటీలు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు.