Pawan Kalyan : బస్సు ప్రమాదం బాధాకరం : పవన్

బస్సు లోయలోపడి ప్రయాణీకుల దుర్మరణం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు

Update: 2025-12-12 04:41 GMT

బస్సు లోయలోపడి ప్రయాణీకుల దుర్మరణం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. అలాగే మృతి చెందిన కుటుంబాలకు పవన్ కల్యాణ్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

గాయపడిన వారిని...
"అల్లూరి సీతారామ రాజు జిల్లాలో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారని తెలిసి చింతిస్తున్నాను. యాత్రికులతో కూడిన బస్సు చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయిందని అధికారుల ద్వారా అందిన సమాచారం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ దుర్ఘటనలో 22 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించడమైనది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుంది" అని పవన్ పేర్కొన్నారు.


Tags:    

Similar News