Chandrababu : బస్సు ప్రమాద ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకరమని చంద్రబాబు అన్నారు. పొగమంచు విపరీతంగా ఉండటం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని చంద్రబాబు తెలియచేశారు.
బాధితులను ఆదుకుంటాం...
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు వద్ద జరిగిన యాత్రికుల ప్రైవేటు బస్సు ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్న చంద్రబాు, ప్రమాదంపై అధికారులతో మాట్లాడానని, బాధితులకు అందుతున్న సాయంపై వివరాలు తెలుసుకున్నానని చంద్రబాబు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించానన్నారు. ప్రమాద మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని తెలిపారు.