Cold Winds : బాంబు పేల్చిన వాతావరణ శాఖ... అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకండి

చలిగాలుల తీవ్రత మరింత పెరుగుతుంది. వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది.

Update: 2025-12-12 04:56 GMT

చలిగాలుల తీవ్రత మరింత పెరుగుతుంది. వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. మరో మూడు రోజులు పాటు చలితీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అంటే చలికి గడ్డకట్టిపోయేలా వాతావరణం ఉండనుంది. ఈ మూడురోజులు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమవ్వాలని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఉత్తర భారత దేశంలో సాధారణంగా చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అక్కడి వాతావరణ పరిస్థితులు అలాగుంటాయి. కానీ దక్షిణ భారత దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చలిగాలుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. అందులోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో మూడు రోజుల పాటు చలితీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఏపీలో చలి జ్వరాలు...
ఆంధ్రప్రదేశ్ లో చలిపంజాతో అనేక మంది మంచం పడుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేల బయటకు వెళ్లే వారు ఈ చలిగాలుల దెబ్బకు ఆసుపత్రుల బాట పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా ఏపీలో ఉక్కపోత వాతావరణం ఉంటుంది. అలాంటిది గత వారం రోజుల నుంచి గోదావరి తీర ప్రాంతంలోనూ, ఏజెన్సీ ఏరియాల్లోనూ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో జనం గజ గజ వణికిపోతున్నారు. ఉదయం, సాయంత్రం వేళ బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
తెలంగాణలో మరింతగా...
తెలంగాణలో మామూలుగానే చలి ఎక్కువగా ఉంటుంది. ఆంద్రప్రాంతంతో పోలిస్తే తెలంగాణలో ప్రతి ఏడాది చలిగాలులు ఎక్కువగా వీస్తుంటాయి. ఉత్తరాది నుంచి వచ్చే చలిగాలుల ప్రభావంతో గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇరవై జిల్లాలకు పైగానే చలితీవ్రతకు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ ఇరవై జిల్లాల్లో పది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఆరు డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో మరింత చలిగాలులువీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 13వ తేదీ వరకూ చలి ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచిబయటకు రావద్దని సూచించింది. సాధారణంకంటే ఐదు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయనివాతావరణ శాఖ వెల్లడించింది.


Tags:    

Similar News