Chandrababu : చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారయింది.

Update: 2025-12-12 12:29 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారయింది. ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలతో కూడా చంద్రబాబు సమావేశమయ్యే అవకాశముంది. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల అమలు, ఇతర విషయాలపై చర్చించనున్నారు. అలాగే కేంద్ర మంత్రులతోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు.

ఈ నెల 18వ తేదీ రాత్రికి...
రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి మాత్రమే ఈ ఢిల్లీ పర్యటన ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. డిసెంబరు 18వ తేదీ సాయంత్రం ఢిల్లీకి విజయవాడ నుంచి బయలుదేరి వెలతారు. అదే రోజు రాత్రి బీజేపీ పెద్దలను చంద్రబాబు కలవనున్నారు. 19వ తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఇప్పటికే కొందరి కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ కోసం టీడీపీ ఎంపీలు సంప్రదించారు.


Tags:    

Similar News