Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇలా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. నేడు వివిధ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు సచివాలయానికి చంద్రబాబు రానున్నారు. వచ్చిన వెంటనే కొందరు అధికారులు, ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్న వారితో సమావేశమవుతారు.
చీఫ్ సెక్రటరీతో...
మధ్యాహ్నం 2.30 గంటలకు వివిధ కీలక ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు, పనులు, పెట్టుబడులపై చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. సీఆర్డీఏ అధారిటీ సమావేశంలోనూ చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటలకు సచివాలయం నుంచి ఇంటికి తిరిగి వెళతారు.