Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇలా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఈరోజు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఈరోజు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీకి చంద్రబాబు వెళ్లనున్నారు. 10.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. సాయంత్రం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి సచివాలయానికి చేరుకుంటారు.
స్పోర్ట్స్ ప్రాజెక్టుపై...
సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు స్పోర్ట్స్ ప్రాజెక్టుపై సమీక్షను చంద్రబాబు చేయనున్నారు. అమరావతి ప్రాంతంలో స్టేడియం నిర్మాణంపై చర్చిస్తారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులు, మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఉండవల్లి నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు.