తిరుపతిలో క్షుద్రపూజల కలకలం
ప్రస్తుతం గ్రామంలో క్షుద్రపూజల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమను భయాందోళనకు
occult practises
తిరుపతి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టిస్తున్నాయి. తిరుపతికి సమీపంలోని పూడి గ్రామంలో గల జూగుంట చెరువు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లు స్థానికులు గుర్తించారు. క్షుద్రపూజల ఆనవాళ్లను చూసి భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ప్రస్తుతం గ్రామంలో క్షుద్రపూజల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమను భయాందోళనకు గురిచేసిన ఆ వ్యక్తులను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. పోలీసులు క్షుద్రపూజలు చేసిన వ్యక్తుల కోసం వెతుకుతున్నారు.