చంద్రబాబు కనుమ శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుమ శుభాకాంక్షలు తెలిపారు
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పశు సంపద మనకు అసలైన సంపద అని తెలిపారు. పశు సంపదను పూజించడాన్ని కనుమ బోధిస్తుందని చంద్రబాబు అన్నారు. కనుమ రోజున పశువులను పూజిస్తే రైతులకు మేలు జరుగుతుందని, పంటలు పుష్కలంగా పండుతాయని ప్రతీతి అని తెలిపారు.
పశువులతో విడదీయరాని...
రైతులు, పశువులకు విడదీయరాని అనుబంధం ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశు పక్ష్యాదులను చక్కగా చూసుకుంటే ప్రకృతి కూడా కరుణిస్తుందని తెలిపారు. అందరి ఇళ్లల్లో మంచి పంటలు సమృద్ధిగా పండి రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. కనుమ రోజు పశువులను పూజించడం సంప్రదాయంగా వస్తుందన్నారు.