Chandrababu : సంక్రాంతికి నారావారిపల్లె ప్రజలకు చంద్రబాబు గుడ్ న్యూస్

సంక్రాంతి పండగ వేళ నారావారిపల్లె ప్రజలకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు

Update: 2026-01-15 11:47 GMT

సంక్రాంతి పండగ వేళ నారావారిపల్లె ప్రజలకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఏడాదిలో ఇంటిని నిర్మిస్తామని తెలిపారు. కొందరికి ఇళ్ల స్థలాలున్నా ఇల్లు లేవని, అయితే వారందరికీ ఏడాదిలో అందరికీ ఇళ్లు కల్పిస్తామని చెప్పారు. నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. పీ-4లో భాగంగా మార్గదర్శి, బంగారు కుటుంబాల వ్యవస్థ ద్వారా 10 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నామని తెలిపారు. 2026లో దీనిపై మరింత ఫోకస్ పెడతామన్నారు. మూడు రోజులుగా స్వగ్రామంలోనే ఉండి సమస్యలు కూడా తెలుసుకున్నాను.. భోగి, సంక్రాంతి వేడుకలు నిర్వహించుకున్నామని తెలిపారు.

ఇంటింటికీ మంచినీటిని...
వికసిత్ భారత్-2047 కి అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించుకుని 2029కి, 2039కి ఏం చేయాలో టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నామన్న చంద్రబాబు స్వర్ణ నారావారిపల్లెకు గతేడాది శ్రీకారం చుట్టాం.. ఇక్కడ జీవన ప్రమాణాలు, ఆదాయం పెంచాలని నిర్ణయించామని తెలిపారు. కొందరికి ఇంటి స్థలమున్నా సొంతిల్లు లేదని, అందుకే ఏడాదిలో ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పిస్తామని, ఇంటింటికీ నీటి సరఫరాను కూడా అందించే కార్యక్రమం చేపడుతున్నామని చంద్రబాబు చెప్పారు. ధాన్యం కొనుగోలుకు రూ.10 వేల కోట్లు చెల్లించి, రైతులు ఆనందంగా ఉండేలా చూశామని చెప్పారు.


Tags:    

Similar News