Andhra Pradesh : డ్రోన్లు ఎగరడంపై 16 వరకూ నిషేధం
భారత ప్రధాని మోదీ ఈ నెల 16వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. దీంతో ఈరోజు నుంచి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నల్లమలఅటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. దీంతో పాటు నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకూ కర్నూలు ప్రాంతంలో డ్రోన్లు ఎగురవేయకూడదని పోలీసులు నిషేధం విధించారు. డ్రోన్లను ఎగరేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు, రోడ్ షోకు మహిళలకు, పురుషులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ను కూడా పెట్టారు.
రోడ్ షో సందర్భంగా...
దీంతో పాటు రోడ్ షో సందర్భంగా పోలీసులు అన్ని ముందస్తు చర్యలు కర్నూలులో తీసుకుంటున్నారు. జీఎస్టీ సంస్కరణల ప్రచారం నేపథ్యంలో మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే భారీ పోలీసు బలగాలు కర్నూలు జిల్లాకు చేరుకున్నాయి. శ్రీశైలంలో పర్యటించి వచ్చిన అనంతరం మోదీ కర్నూలు జిల్లాలో జరిగే బహిరంగ సభ, రోడ్ షోలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.