కంటతడి పెట్టిన నారా లోకేష్
టీడీపీ నేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జ్యుడీషియల్ రిమాండులో
acb court seeking permission to arrest nara lokesh
టీడీపీ నేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జ్యుడీషియల్ రిమాండులో ఉన్నారు. ఆయనను బయటకు తీసుకుని రావడానికి ఆయన తరపున లాయర్లు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆయనది అక్రమ అరెస్టు అంటూ టీడీపీ నేతలు అంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ తన తండ్రి అరెస్టు, జైలులో ఇన్ని రోజులు పెట్టడం వెనుక కుట్రలు ఉన్నాయని ఆరోపిస్తూ ఉన్నారు. ఏ తప్పూ చేయని చంద్రబాబును ప్రభుత్వం కక్షపూరితంగా జైలులో పెట్టిందని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 45 సంవత్సరాలుగా క్రమశిక్షణతో, పట్టుదలతో మనందరి కోసమే చంద్రబాబు నాయుడు పనిచేశారని లోకేశ్ అన్నారు. అలాంటి నేతను 43 రోజులుగా రాజమండ్రి జైలులోనే ఉంచారని చెప్పారు. తలుచుకుంటేనే దుఃఖం తన్నుకొస్తోందని లోకేశ్ ఆవేదన చెందారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ప్రజానాయకుడిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఆలోచించాలని అన్నారు. తండ్రి పరిస్థితి గురించి చెబుతూ లోకేశ్ కన్నీటిపర్యంతమయ్యారు.