Mudragada Padmanabham : అంబటి కుమార్తె మౌనికపై ముద్రగడ ప్రశంసలు
వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వచ్చారు
వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వచ్చారు. ఇటీవల టీడీపీ శ్రేణుల దాడుల్లో ధ్వంసమయిన ఇంటిని ముద్రగడ పరిశీలించారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంబటి రాంబాబు కుమార్తె మౌనికపై ముద్రగడ పద్మనాభం ప్రశంసలు కురిపించారు. అంబటి మౌనిక మరో మమత బెనర్జీలా తయారవుతారని అన్నారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా...
కాపుల అండతోనే అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వారి ఇళ్లపైనే దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రశ్నిస్తే ఇళ్లపై దాడులు చేస్తారా? అని ముద్రగడ పద్మనాభం నిలదీశారు. ఇందుకు సరైన మూల్యం కూటమి ప్రభుత్వం చెల్లించుకుంటుందని ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. దాడి చేసిన వారిపై పోలీసులు కేసులు పుెట్టకుండా అంబిని జైల్లో వేయడం ఏంటని ప్రశ్నించారు.