రాజమండ్రిలో పాలు తాగి నలుగురు మృతి వెనక అసలు కారణమిదేనా?
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు మరణించగా, మరికొందరు అస్వస్థతకు గురయ్యారు
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు మరణించగా, మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. అనూరియా సమస్యలపై అధికారుల మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు73 శాంపిల్స్ సేకరించామని చెప్పారు. ఈరోజు సాయంత్రానికి ఫలితాలు వస్తాయనతి తెలిపారు. ఇంటింటి సర్వే కొనసాగుతోందని, 42 మంది రైతుల నుంచి పాల సేకరణ జరుగుతోందని, పాల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, కేసు కూడా నమోదైందని, దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. పాలు, పెరుగు శాంపిళ్లను ఫుడ్ సేఫ్టీ విభాగం సేకరించిందని, ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనించి సమీక్షలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
పాలు సరఫరా చేసిన వ్యక్తిని...
పాలు సరఫరా చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, అనధికారికంగా నడుపుతున్న డెయిరీని సీజ్ చేశామని తెలిపారు. విజయవాడ నుంచి కూడా నిపుణులు వచ్చారని, శాంపిళ్ల సేకరణ జరుగుతోందని, వాటి ఫలితాలు వచ్చాక మరిన్ని వివరాలు వస్తాయని తెలిపారు. ఇప్పటివరకు నలుగురు మరణించారని చెప్పారు. తాడి కృష్ణవేణి, తాడి రమణి, రాధాకృష్ణమూర్తి, శేషగిరిరావు మరణించారని, పాలలో కల్తీ కారణంగా ఎనిమిది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇంటింటికి వెళ్లి రక్త నమూనాల సేకరణ కొనసాగుతోందని, ఏ లక్షణాలున్నా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయవచ్చని, ఇందుకోసం 94940 60060 కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయవచ్చని అధికారులు తెలిపారు.